Siddharth: బీజేపీ ఎంపీపై హీరో సిద్దార్ద్ సంచలన వ్యాఖ్యలు

Siddharth: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై హీరో సిద్దార్ద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Venkata Chari
Updated on: 6 May 2021 8:30 PM IST
Hero Siddharth Controversial Comments BJP MP Tejasvi Surya
X

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, హీరో సిద్దార్ద్ (ఫొటో ట్విట్టర్)

Siddharth: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై హీరో సిద్దార్ద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో తమిళనాడు బీజేపీకి, ఈ హీరోకు మధ్య మాటలు రోజురోజుకు ముదురుతోంది. ఇటీవల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వచ్చాయని, అంతేగాక అత్యాచారం బెదిరింపులు కూడా వచ్చాయని హీరో సిద్దార్ద్ వెల్లడించిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్‌ తన పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌ లీక్‌ చేయడం వల్లే ఇదంతా జరిగిందని నెట్టింట్లో వాపోయిన సంగతి తెలిసిందే. అయితే దీనిని బీజేపీ తీవ్రంగా ఖండించడంతో.. వివాదం మొదలైంది.

తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యల చేశాడు హీరో సిద్ధార్ద్. బీజేపీ యువ పార్ల‌మెంట్ స‌భ్యుడు తేజ‌స్వి సూర్య‌పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదానికి తెరతీశాడు ఈ యంగ్ హీరో. బెంగ‌ళూరులోని ప‌లు ఆస్ప‌త్రుల్లో చాలా బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, వాటిని తేజస్వి బ్లాక్ చేశాడ‌ని ఇప్ప‌టికే అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై సిద్దార్థ్‌ ట్విట్టర్లో ట్వీట్‌ చేస్తూ.. 'యంగ్ ఎంపీ తేజ‌స్వి సూర్య చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి. టెర్ర‌రిస్ట్ అజ్మ‌ల్ క‌స‌బ్ కంటే ద‌శాబ్ద‌కాల‌పు ముందు వ్య‌క్తి. ఈ ట్వీట్‌ను సేవ్ చేయండి' అంటూ ట్వీట్ చేశాడు. సిద్దార్థ్ ట్వీట్ పై బీజేపీ స్పందిస్తూ.. రాజ‌కీయ భావ‌జాలం భిన్నంగా ఉండొచ్చు. కానీ సిద్దార్థ్ వ్యాఖ్య‌లు స‌మ‌ర్థ‌నీయ‌మైన‌వి కావు. సిద్దార్థ్ త‌న దూకుడును త‌గ్గించుకోవాలి' అని హెచ్చరించింది. దీంతో ఈ వివాదం ఎంతవరకు పోతోందో తెలియని పరిస్థితి నెలకొంది.

Venkata Chari

Venkata Chari

Next Story