Assam: అస్సాంలో కుంభవృష్టి.. నల్బరి జిల్లాలో కూలిపోయిన బ్రిడ్జ

Assam: ఉగ్రరూపం దాల్చిన పగ్లాడియా నది

Shekhar G
Published on: 21 Jun 2023 7:07 PM IST
Heavy Rains In Assam Bridge Collapse In Nalbari District
X

Assam: అస్సాంలో కుంభవృష్టి.. నల్బరి జిల్లాలో కూలిపోయిన బ్రిడ్జ

Assam: అస్సాంలో కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అస్సాంలోని పగ్లాడియా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రవాహ ఉధృతికి నల్బరి జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయింది. ధాంధామ, తముల్‌పూర్‌ గ్రామాలను కలుపుతూ ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో నదికి ఇరువైపుల ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి. పగ్లాడియా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story