మహారాష్ట్రలో భారీ వర్షాలు

Maharashtra: ముంబైలో లోతట్టు ప్రాంతాలు జలమయం

Jyothi
Published on: 9 Aug 2022 12:59 PM IST
Heavy Rain In Maharashtra | Telugu News
X

మహారాష్ట్రలో భారీ వర్షాలు

Maharashtra: మహారాష్ట్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో లోతట్టు ప్రాంతలు జలమయమయ్యాయి. అంధేరిలో రైల్వే బ్రిడ్జి సబ్‌వే నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బివాండీలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి దుకాణాల్లోకి వరద నీరు చేరింది. వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క ముంబైలో సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. భారీ ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. అలల ధాటికి రోడ్డుపైన వెళ్లే వారు తడిసి ముద్దవుతున్నారు.

Jyothi

Jyothi

Next Story