Lav Agarwal on Coronavirus crisis: కరోనా కట్టడికి మరోసారి రంగంలోకి కేంద్రం

Arun Chilukuri
Updated on: 26 Jun 2020 11:50 AM IST
Lav Agarwal on Coronavirus crisis: కరోనా కట్టడికి మరోసారి రంగంలోకి కేంద్రం
X

తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో కట్టడి విషయంలో స్థానిక అధికారులకు సహకరించడం కోసం రాష్ట్రాలకు బృందాన్ని పంపుతోంది. నేటి నుంచి మూడు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యలను కేంద్రబృందం పర్యవేక్షించనుంది.

కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో బృందం రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను తెలుసుకొనుంది. జూన్ 29 వరకు మూడు రాష్ట్రాల్లో పర్యటించి కోవిడ్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ బృందం పరిశీలించనుంది. తెలంగాణలో ఈ బృందం పర్యటిస్తుండటం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story