ప్రభుత్వ అధికారిని చెప్పుతో చావగొట్టిన బీజేపీ టిక్ టాక్ స్టార్

బీజేపీ నాయకురాలు టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ హర్యాణాలోని ప్రభుత్వ అధికారిపై కెమెరా ముందు చెప్పుతో కొట్టింది.

Samba Siva Rao
Published on: 5 Jun 2020 8:53 PM IST
ప్రభుత్వ అధికారిని చెప్పుతో చావగొట్టిన బీజేపీ టిక్ టాక్ స్టార్
X

బీజేపీ నాయకురాలు టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ హర్యాణాలోని ప్రభుత్వ అధికారిపై కెమెరా ముందు చెప్పుతో కొట్టింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసభ్య పదజాలం వాడుతూ , అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుతో చెంపలు వాయించారు. పోలీసు అధికారుల సమక్షంలో ప్రభుత్వ అధికారి పై దాడి చేశారు . ప్రభుత్వ అధికారి పై ఫిర్యాదు చేయకుండా దాడి చేయడం పై పలు విమర్శలు చేస్తున్నారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో హర్యాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేసి సోనాలి ఫొగట్ ఓడిపోయింది. గతేడాది భార‌త్ మాతాకీ జై అని నిన‌దించని వారిని పాకిస్తానీయులుగా వ‌ర్ణిస్తూ టిక్‌ టాక్ స్టార్ సోనాలి ఫొగ‌ట్ వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story