బ్రిటన్ రాజకుటుంబలో మనస్పర్థలు

రాజకుటుంబంతో ప్రిన్స్‌ విలియమ్, ప్రిన్స్‌ హ్యారీ దంపతులకు చెడిందనే ఊహాగానాలకు బలం చేకూరుస్తు మరో ప్రకటన వెలువడింది.

admin1
Updated on: 9 Jan 2020 10:07 PM IST
బ్రిటన్ రాజకుటుంబలో మనస్పర్థలు
X

బ్రిటన్ రాజకుటుంబలో మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. రాజకుటుంబంతో ప్రిన్స్‌ విలియమ్, ప్రిన్స్‌ హ్యారీ దంపతులకు చెడిందనే ఊహాగానాలకు బలం చేకూరుస్తు మరో ప్రకటన వెలువడింది. తాము రాజకుటుంబం నుంచి వేరుపడుతున్నట్లు ప్రిన్స్‌ హ్యారీ, మెఘన్‌ మర్కెల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇకపై రాజకుటుంబంలో సీనియర్ సభ్యులుగా కొనసాగడం లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాణి ఎలిజబెత్‌కు.. ఓ లేఖ ద్వారా వెల్లడించారు. అలాగే ససెక్స్‌ రాయల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ విషయాన్ని వెల్లడించారు. తాము స్వతంత్య్రులుగా ఉండాలని అనుకుంటున్నట్లు పోస్ట్‌లో వివరించారు. ఇక నుంచి తాము ఉత్తర అమెరికాలో సమయం గడుపుతామని చెప్పారు.

admin1

admin1

Next Story