New Delhi: గురుగ్రామ్‌లో కుక్కలకు పెళ్లి జరిపించిన యజమానులు

* పెళ్లి పందిరి... కుక్క కాళ్లకు పారాణి, గొలుసులు.... సాంప్రదాయ బద్ధంగా సారె, వస్తు సామగ్రి, కట్నకానుకలు

R Tripura Malini
Published on: 14 Nov 2022 7:59 AM IST
gurugram couple performs all wedding rituals for pet dogs
X

గురుగ్రామ్‌లో కుక్కలకు పెళ్లి జరిపించిన యజమానులు

Sheru Weds Sweety: పెళ్లి మనిషి జీవితంతో ఓ మధుర ఘట్టం. తెలివితేటలున్న మనుషులు మనసుకు నచ్చిన వారిని ప్రేమించడం, పెద్దలను ఒప్పించి పెళ్లిదాకా తీసుకురావడం, ప్రేమించినోళ్లను పెళ్లిచేసుకోవడం సర్వసాధారణం. మనుషుల్లాగే జంతువులకూ మనసుంటుందని, మనసుకు నచ్చినవాటితో సఖ్యతగా మెలుగుతాయి. ఇదే విషయాన్ని గుర్తించిన గురుగ్రామ్ వాసులు తమ ఇంట్లో పెంచుకున్న కుక్కలకు మనసు పంచుకున్న కుక్కలతో పెళ్లివేడుక నిర్వహించారు.

ఇరుగు పొరుగును పిలిచి సాంప్రదాయానుసారం వివాహం జరిపించారు. పెళ్లికి ముందుగానే పెళ్లికొడుకు ఇంటికి ఇవ్వాల్సిన వస్తు సామగ్రిని పెళ్లి వేడుకలో ప్రదర్శించారు. కుక్కను అల్లారు ముద్దుగా పెంచుకున్నట్లే... పెళ్లికూతురిలా కాళ్లకు గొలుసులు తొడిగి పారాణి పెట్టారు. కంటికి కాటుక, పసుపు కుంకుమలతో అలంకరించి పెళ్లి వేదికపై కూర్చోబెట్టి మాంగల్యధారణ చేయించారు. అంతేకాదు పెళ్లయిన తర్వాత అప్పగింతలు, బంధు మిత్రుల కలిసి బరాత్‌ నృత్యాలు సందడిగా మారాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story