Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల కలకలం

Chhattisgarh: పలువురు మావోయిస్టులు గాయపడినట్లు సమాచారం

Shekhar G
Published on: 21 Feb 2024 7:09 PM IST
Gunfire Again In Chhattisgarh
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల కలకలం

Chhattisgarh: చత్తీస్‌ఘడ్ లో మరోసారి మావోయిస్టులు ..పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కలకలం రేపాయి. బీజాపూర్ - దంతివాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని పెడియా అడవుల్లో పోలీసులకు- మావోయిస్టులకు మధ్య హోరా హోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. సుమారు 45 నిమిషాలు పాటు జరిగిన కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడినట్లు సమాచారం.

పశ్చిమ బస్తర్‌ డివిజన్ కమిటీకి చెందిన 50 మంది మావోయిస్టు అగ్ర నేతలు సమావేశమవుతున్నట్లు వచ్చిన సమాచారంతో బీజాపూర్, దంతేవాడ జిల్లాలకు చెందిన భద్రత దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అందులో భాగంగానే.. మావోయిస్టు క్యాంప్ ను భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఇంకా జాయింట్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం

Shekhar G

Shekhar G

Next Story