Coronavirus: దేశంలో పూర్తి లాక్‌డౌన్ విధించం- కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌పై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 14 April 2021 2:36 PM IST
Govt will not Impose Lockdown Says Nirmala Sitharaman
X

Coronavirus: దేశంలో పూర్తి లాక్‌డౌన్ విధించం- కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ 

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌పై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కేంద్రం పూర్తి లాక్‌డౌన్‌ విధించబోదని స్పష్టం చేశారు ఆమె. లాక్‌డౌన్‌ విధించి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టడం తమకిష్టంలేదన్నారు. ఇక కరోనా కట్టడి ఆయా కంటైన్మెంట్‌ జోన్లలో కఠిన చర్యలపై ఆధారపడి ఉంటుందన్నారు నిర్మలా సీతారామన్‌. టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకాలు, కరోనా మార్గదర్శకాల అమలులాంటి ఐదు స్తంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామని సీతారామన్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story