Lok Sabha: న్యాయ బిల్లులను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం

Lok Sabha: స్టాండింగ్ కమిటీ సూచనలతో సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయం

Shekhar G
Updated on: 12 Dec 2023 1:28 PM IST
Government Withdraws Three Criminal Codes To Replace Them With New Bills
X

Lok Sabha: న్యాయ బిల్లులను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం

Lok Sabha: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మూడు న్యాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రస్తుతమున్న నేర న్యాయ చట్టాల స్థానంలో గతంలో పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది కేంద్రం. ప్రస్తుతం ఉన్న నేరన్యాయ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను గత ఆగస్టులో లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. వాటిని ఈ సమావేశాల్లో ఆమోదించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బిల్లులను ఎజెండాలో చేర్చింది. అయితే ఈ బిల్లులను పరిశీలన కోసం పంపగా.. స్టాండింగ్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. దీంతో ఆ సిఫార్సులకు బిల్లుల్లో స్థానం కల్పించి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాము ప్రవేశపెట్టిన బిల్లులను వెనక్కి తీసుకుంది.

Shekhar G

Shekhar G

Next Story