Rajasthan Cabinet: మంత్రులకు శాఖలు కేటాయించిన రాజస్థాన్ సర్కార్

Rajasthan Cabinet: ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దగ్గరే కీలకమైన శాఖలు

Sandeep Eggoju
Published on: 22 Nov 2021 7:17 PM IST
Rajasthan Government Allocated the Departments to Ministers
X

మంత్రులకు శాఖలు కేటాయించిన రాజస్థాన్ గవర్నమెంట్ (ఫైల్ ఇమేజ్)

Rajasthan Cabinet: రాజస్థాన్ సర్కార్ కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 15 మంది మంత్రులకు శాఖలు కేటాయించింది. ఇదే సమయంలో మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులూ చేసింది. కీలకమైన హోం, ఆర్థిక, ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనదగ్గరే ఉంచుకున్నారు. ఇక డాక్టర్ బీడీ కల్లాకు విద్య, కళలు, సాహిత్యం, సాంస్కృతిక శాఖలను అప్పగించారు. అలాగే, శాంతి ధరివాల్‌కు న్యాయ, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ ఎఫైర్స్ శాఖలను కట్టబెట్టారు. ఇక పర్సిదిలాల్ మీనాకు వైద్యారోగ్య, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story