కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌.. ఎలా పనిచేస్తుందో తెలుసా..

కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌.. ఎలా పనిచేస్తుందో తెలుసా..
x
Highlights

భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే పేరుతో కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్ఐసీ సూచనలను పాటిస్తూ పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలుగు రోజుల్లోనే ఈ యాప్‌ను రూపొందించింది.

భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే పేరుతో కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్ఐసీ సూచనలను పాటిస్తూ పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలుగు రోజుల్లోనే ఈ యాప్‌ను రూపొందించింది. ఎవరికైనా కరోనా పేషెంట్‌ కాంటాక్ట్‌లోకి వస్తే వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ యాప్ ప్రభుత్వానికి అందజేస్తుంది. కరోనా సోకిన వ్యక్తి సమీపంలో యాప్ యూజర్ ఉన్నాడా లేదా అనే వషయాన్ని స్మార్ట్ ఫోన్ లొకేషన్ డేటా, బ్లూటూత్ ద్వారా ఈ యాప్ తెలుపుతుంది.

ఈ యాప్ ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ల డేటాను కేవలం భారత ప్రభుత్వానికి మాత్రమే షేర్ చేస్తుంది. బయటి వారికి ఎవరికీ షేర్ చేయదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పేరు, ఫోన్ నంబర్ లాంటి వివరాలు ఈ యాప్ ద్వారా బయటపడవు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే లైవ్ ట్వీట్లను అండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారు సులభంగా వీక్షించే వీలుంది. కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గురించి అందించే అప్‌డేట్స్‌ను కూడా ఇందులో చూసుకోవచ్చును. ఈ యాప్ లో యూజర్స్ కోసం రాష్ట్రాల వారీగా కరోనా వైరస్ హెల్ప్ లైన్ల సమాచారాన్ని వివరంగా పొందుపరిచారు.

అంతే కాక యూజర్స్ కరోనా లక్షణాలను అర్థం చేసుకొని, ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడానికి చాట్‌బోట్ ఫెసిలిటీని కూడా ఇందులో అందించారు. 11 భాషల్లో కరోనా గురించిన సమాచారాన్ని ఈ యాప్ ద్వార పొందొచ్చు. అండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్‌లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. దీన్ని వాడాలనుకునే వారు తమ ఫోన్ నంబర్ సాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories