Good News: కరోనా చికిత్సకు మందు వచ్చేసింది!
కరోనా వైరస్ సోకితే ఇకపై భయపడాల్సిన పనిలేదని చెబుతోంది Glenmark Pharmaceuticals కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేస్తున్న మందుతో కరోనా సోకిన వారికి వైద్యం చేయొచ్చని ప్రకటించింది.
ప్రముఖ Glenmark Pharmaceuticals కంపెనీ కరోనా రోగుల చికిత్సకు మందు విడుదల చేసినట్టు ప్రకటించింది. 'ఫవిపిరావీర్' అనే ఔషధాన్ని కరోనా చికిత్స కోసం ఆవిష్కరించామని ఆ సంస్థ చెబుతోంది. ఈ యాంటీ వైరల్ డ్రగ్ ను 'ఫవిపిరావీర్ ఫాబిఫ్లూ ' పేరుతో అందుబాటులోకి తీసుకువస్తున్నామని గ్లెన్మార్క్. సంస్థ అంటోంది.
ఈ మందు తేలికపాటి లేదా ఒక మోసత్రు స్థాయిలో కరోనాతో బాధపడుతున్నవారికి బాగా ఉపయోగకారిగా పనిచేస్తుందని సంస్థ పేర్కొంది. వైరస్ ప్రాథమిక స్థాయిలో ఉన్నపుడు కనుక ఈ మందు తీసుకుంటే ప్రాణాలతో బయటపడవచ్చని చెబుతోంది గ్లెన్మార్క్.
తమకు ఈ మందు ఇండియాలో తయారీతో పాటు మార్కెటింగ్ కు అనుమతులు లభించినట్టు చెప్పింది.
ఈ మందు ఎలా ఉంటుందంటే..
గ్లెన్మార్క్ చెబుతున్న దాని ప్రకారం ఈ మందు టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఒక స్ట్రిప్ లో 34 టాబ్లెట్లు ఉంటాయి. వీటిని చికిత్సలో భాగంగా రోజుకు నాలుగు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొదటి రోజు మాత్రం 9 మాత్రలు వేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మొత్తం 14 రోజుల పాటు ఈ టాబ్లెట్లు వేసుకోవాలి. ఇది కరోనా రోగులకు 80 శాతం పనిచేస్తుందని గ్లెన్మార్క్ భరోసా ఇస్తోంది. ఇక ఈ త్యబ్లేట్ ధర ఒక్కోదానికీ 103 రూపాయల వరకూ ఉంటుంది. అంటే మొత్తం 34 టాబ్లెట్ల స్ట్రిప్ ధర 3,500 రూపాయల వరకూ ఉండొచ్చు.
ఇక ఈ మెడిసిన్ మార్కెటింగ్ చేసి అమ్ముకునేందుకు ఇతర ఇండియా కంపెనీలు అయిన Delhi-Brinton Pharmaceuticals, Bengaluru-Strides Pharma, Mumbai-Lasa Supergenerics, Hyderabad-Optimus Pharmaలు ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.




