Gold Rate: తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

Gold Rate: కొద్ది రోజులు హడలెత్తించిన బంగారం ధరలు క్రమంగా నేల చూపులు చూస్తోంది.

Kranthi
Published on: 30 March 2021 8:14 AM IST
Gold Rate: Reduced Gold, Stable Silver Prices
X

Gold Rate:(ఫైల్ ఇమేజ్)

Gold Rate: కొద్ది రోజులు హడలెత్తించిన బంగారం ధరలు క్రమంగా నేల చూపులు చూస్తోంది. మరో వైపు వెండి రేటు మాత్రం స్థిరంగా స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లలో మాత్రం బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి.

హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల ధర...

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 దిగొచ్చింది. దీంతో రేటు రూ.45,490కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.210 క్షీణతతో రూ.41,700కు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం అక్కడే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.69,300 వద్దనే కొనసాగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో 1710 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.51 శాతం క్షీణతతో 24.64 డాలర్లకు తగ్గింది.ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు కారణాలు బంగారం రేటు పై ప్రభావం చూపుతున్నాయి.

Kranthi

Kranthi

Next Story