భక్తి ముసుగులో ఎన్నాళ్లు ఈ దారుణాలు..?

అతడికి ఏడు పదుల వయసు దాటింది. మనవళ్లను, మనవరాళ్లను ఎత్తుకోవాల్సిన సమయం. కాటికి కాలు చాపిన ముదురు. ఆ వయసులో

admin1
Published on: 29 Feb 2020 8:50 PM IST
భక్తి ముసుగులో ఎన్నాళ్లు ఈ దారుణాలు..?
X
Baba veerendra dev deekshit (File Photo)

అతడికి ఏడు పదుల వయసు దాటింది. మనవళ్లను, మనవరాళ్లను ఎత్తుకోవాల్సిన సమయం. కాటికి కాలు చాపిన ముదురు. ఆ వయసులో అతడికి గురువుగా మారాలని ఒక తీరని కల. అయితే.. అందుకు ఆధ్యాత్మికాన్ని ఎంచుకున్నాడు. ప్రజల అమాయకత్వమే అతడికి పెట్టుబడిగా మారింది. ఇంకేముంది.. తనకు తానుగా కలియుగ కృష్ణుడిగా ప్రకటించుకున్నాడు. దాంతో 16వేల మంది గోపికలతో ఆడిపాడాలనుకున్నాడు. ఢిల్లీలో ఆశ్రమాన్ని నిర్మించి భక్తిముసుగులో అరాచకాలకు తెర లేపాడు. ఒక్కసారి ఆ ఆశ్రమంలో అడుగు పెడితే తిరిగి బయటకు పడే చాన్సు లేదు.. ఆశ్రమంలో ఆగడాలు.. అగేది ఎన్నడు.. భక్తి ముసుగులో ఎన్నాళ్లు ఈ దారుణాలు..? ఆశ్రమాల పేరుతో ఎన్నాళ్లు ఈ అరాచకాలు. ఈ దారుణాలకు అంతమే లేదా..?

వీరేంద్ర ఆశ్రమంలో నిజమాబాద్ యువతి చిక్కుక్కుంది. దాంతో ఆశ్రమాల అరాచకాల గురించి మరోసారి వెలుగులోకి వచ్చింది. తమ కూతురు కనిపించడం లేదని.. ఆశ్రమంలో బందీ అయిందని ఢిల్లీని ఆశ్రయించారు ఆమె తల్లిదండ్రులు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మూఢభక్తి ముసుగులో వీరేంద్ర చేసిన ఆరాచకాలు అంతా ఇంత కాదు. అసలు ఈ ఆ ఆశ్రమం ఎలా ఉంటుంది. అక్కడకు వెళ్లితే ఏం అవుతుంది...

పైకి ఆధ్యాత్మిక కేంద్రాలుగా కనిపిస్తూనే.. లోపల మాత్రం అంతకు మించి నేరాలు జరుగుతున్నాయి. ఆశ్రమం పేరుతో అరాచకాలు రాజ్యం మేలుతున్నాయి. భక్తి ముసుగులో కోట్లు సంపాదిస్తున్నారు. ఆశ్రమాల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. వారికి మత్తు పదార్దాలు లాంటివి అలవాటు చేసి బందీలుగా చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఇలాంటి దారుణాలకు పాల్పడిన బాబాలు చాలా మందే ఉన్నారు. భక్తి ముసుగులో జరుగుతున్న అరాచకాలకు అంతం కావాలంటే.. ఇలాంటి మాయ బాబాల బారిన పడకుండా జనాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

admin1

admin1

Next Story