Covishield Vaccine: కొవిషీల్డ్ రెండో డోసుపై కేంద్రం కీలక ప్రకటన

Center Key Statement on Kovishield Second Dose
x

కవిశిల్డ్ వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Covishield Vaccine: అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే అది చెల్లుబాటు అవుతోంది కేంద్రం

Covishield Vaccine: కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం ఇటీవల పొడిగించింది. దీంతో సెకండ్‌ డోసు కోసం ఆస్పత్రులకు వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొడిగింపు నిర్ణయం ప్రకారం గడువు పూర్తికాని వారిని వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద తిప్పి పంపుతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో కేంద్రం ఆదివారం కీలక ప్రకటన చేసింది. రెండో డోసు కోసం ఇది వరకే అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. కొవిన్‌ పోర్టల్‌లో అపాయింట్‌మెంట్‌ రద్దు చేయలేదని వెల్లడించింది. కొత్తగా రెండోడోసు కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకునేవారికి మాత్రం గడువు పెంపు వర్తిస్తుందని తెలిపింది.

కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సూచనల మేరకు కొవిషీల్డ్‌ రెండో డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు కేంద్రం మే 13న పొడిగించింది. ఈ నేపథ్యంలో రెండో డోసుకు వెళ్తున్న వారిని అక్కడి సిబ్బంది తిప్పి పంపుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే తీసుకున్న అపాయింట్‌మెంట్లు చెల్లుతాయని, వ్యాక్సిన్‌ కోసం వచ్చిన ఎవర్నీ తిప్పి పంపొద్దని కేంద్రం తాజా ఆదేశాల్లో తెలిపింది. ఆ మేరకు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అలాగే వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునేవారు సైతం మొదటి డోసుకు వేసుకున్న 84 రోజుల తర్వాత వ్యాక్సిన్‌ వేసుకునేలా రీషెడ్యూల్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories