తాయత్తులు అమ్మే వ్యక్తికి రూ.106 కోట్లు! ఈ ఛంగూర్ బాబా గురించి తెలిస్తే షాకవుతారు!

తాయత్తులు అమ్మే వ్యక్తికి రూ.106 కోట్లు! ఈ ఛంగూర్ బాబా గురించి తెలిస్తే షాకవుతారు!
x

తాయత్తులు అమ్మే వ్యక్తికి రూ.106 కోట్లు! ఈ ఛంగూర్ బాబా గురించి తెలిస్తే షాకవుతారు!

Highlights

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి ముఠాల గుట్టు రట్టవుతోంది. సాధారణంగా తావీజులు, ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగించిన వ్యక్తి.. ఇప్పుడు భారీగా విదేశీ నిధులతో కూడిన మతమార్పిడి మాఫియాకు కేంద్ర బిందువిగా మారాడు.

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి ముఠాల గుట్టు రట్టవుతోంది. సాధారణంగా తావీజులు, ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగించిన వ్యక్తి.. ఇప్పుడు భారీగా విదేశీ నిధులతో కూడిన మతమార్పిడి మాఫియాకు కేంద్ర బిందువిగా మారాడు. సైకిల్‌పై తిరిగే జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా పేరిట 40 బ్యాంక్ ఖాతాల్లో రూ.106 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. అతడి పట్ల పోలీసులు మతమార్పిడికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

బలరాంపూర్ జిల్లాలో వెలుగుచూసిన మతమార్పిడి కేసులో ఛంగూర్ బాబా పాత్ర కీలకమైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అతడి సహచరురాలు నీతూ అలియాస్ నస్రీన్‌తో పాటు లక్నోలో ఓ హోటల్‌లో ఆయనను శనివారం అరెస్ట్ చేశారు. పేదలు, వితంతువులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలను డబ్బు, ఉద్యోగం, వివాహ హామీలతో మతం మార్చేలా ప్రలోభపెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.

విదేశాల నుంచి ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన నిధులను ఈ ముఠా మతమార్పిడికి వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ఛంగూర్ బాబా గతంలో బలరాంపూర్ జిల్లాలోని రేహ్రా గ్రామ సర్పంచిగా కూడా పనిచేశాడు. రాజకీయ పరిచయాల ద్వారా ప్రజల్లో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నాడు.

ఇంతటితో ఆగకుండా, తన ముఠా కార్యకలాపాల కోసం మధ్పూర్ దర్గా సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఒక భవనాన్ని నిర్మించాడు. అదే కేంద్రంగా అతడి కార్యకలాపాలు సాగినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ భవనాన్ని యూపీ ప్రభుత్వం బుల్డోజర్లతో ధ్వంసం చేసింది.

ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే స్పందిస్తూ, ఛంగూర్ బాబా ఆస్తులన్నీ జప్తు చేస్తామని హెచ్చరించారు. మతమార్పిడి ముఠాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories