Jammu and Kashmir Encounter: నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

Jammu and Kashmir Encounter: భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్ కౌంటర లో 4గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Kranthi
Published on: 22 March 2021 12:02 PM IST
4 terrorists killed in Kashmir encounter
X

ఎన్కౌంటర్:( ఫోటో ది హన్స్ ఇండియా)

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే... షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. కాల్పులు తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఒక ఏకే 47, ఒక పిస్టల్ ను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి.

Kranthi

Kranthi

Next Story