Siddaramaiah Tests Corona Positive : కర్ణాటక మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

Siddaramaiah Tests Corona Positive : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులకి, సినీ స్టార్స్ కి, క్రీడా ప్రముఖులకీ ఇలా

Krishna
Published on: 4 Aug 2020 10:27 AM IST
Siddaramaiah Tests Corona Positive : కర్ణాటక మాజీ సీఎంకు కరోనా పాజిటివ్
X
siddaramaiah

Siddaramaiah Tests Corona Positive : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులకి, సినీ స్టార్స్ కి, క్రీడా ప్రముఖులకీ ఇలా ప్రతి ఒక్కరికి సోకుతుంది. ఇక కర్ణాటాకలో కరోనా రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప, మరియు ఆయన కూతురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత సిద్దరామయ్యకి కరోనా పాజిటివ్ అని తేలింది.

తాజాగా ఆయనకు యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య వచ్చింది. దీనితో అయన బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతూ వస్తున్నారు. అయినప్పటికీ సమస్య ఏ మాత్రం తగ్గకపోవడంతో మళ్ళీ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. ఇక అక్కడ డాక్టర్లు అయనకి వివిధ టెస్టులు నిర్వహించారు. అందులో భాగంగానే కరోనా టెస్టు కూడా నిర్వహించారు...అందులో సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఈ విషయాన్ని అయన ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడించారు. తానూ ముందు జాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్టుగా అయన అందులో పేర్కొన్నారు. ఇక తనను కలిసిన వారందరూ కరోనా పరిక్షలు చేయించుకోవాలని సిద్ధరామయ్య కోరారు. ఇక అటు కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం రోజున కొత్తగ 4,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు అక్కడ 98 మంది చనిపోయారు. తాజా కేసులతో కలిపి అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 1,39,571కి చేరుకోగా, మరణాల సంఖ్య 2,594కి చేరింది.



Krishna

Krishna

Next Story