Yediyurappa's Daughter Tests Positive : యడియూరప్ప కూతురికి కరోనా పాజిటివ్‌!

Yediyurappa’s Daughter Tests Positive : దేశవ్యాప్తంగా కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా

Krishna
Published on: 3 Aug 2020 5:32 PM IST
Yediyurappas Daughter Tests Positive : యడియూరప్ప కూతురికి కరోనా పాజిటివ్‌!
X
Yediyurappa (File Photo)

Yediyurappa's Daughter Tests Positive : దేశవ్యాప్తంగా కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా సోకుతూ ప్రజలని మరింతగా భయబ్రాంతులకి గురి చేస్తోంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (77) నిన్న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక దేశంలో కరోనా సోకిన రెండో ముఖ్యమంత్రి అయనే... అంతకుముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా సోకింది.

ఇక యడియూరప్పకి కరోనా సోకడంతో అయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా తనతో కాంటాక్ట్ లో ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని అయన సూచించారు. ఇక తాజాగా ఆయన కూతురికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతుం ఆమె బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపింది. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ లకు కూడా కరోనా సోకిన సంగతి విధితమే!

ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుతున్న సంగతి తెలిసిందే.. దేశంలో కేసుల సంఖ్య 18 లక్షలు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 52,972 కేసులు నమోదు కాగా, 771 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 40,574 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

Krishna

Krishna

Next Story