హత్రాస్ ఘటన : ఫోరెన్సిక్‌ రిపోర్ట్ లో కీలక విషయాలు!

హత్రాస్ ఘటన : ఫోరెన్సిక్‌ రిపోర్ట్ లో కీలక విషయాలు!
x
Highlights

Hathras Case : దేశంలో మరో నిర్భయ ఘటనగా ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ హత్యాచార ఘటన మారింది. అయితే ఈ కేసులో పోస్టుమార్టం నివేదికని అధికారులు వెల్లడించారు.

Hathras Case : దేశంలో మరో నిర్భయ ఘటనగా ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ హత్యాచార ఘటన మారింది. అయితే ఈ కేసులో పోస్టుమార్టం నివేదికని అధికారులు వెల్లడించారు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఈ నివేదికలో వెల్లడించారు. అయితే బాధితురాలి పట్ల కామాంధులు పైశాచికత్వం చూపించారని వెల్లడైంది. మెడ గాయంతోనే బాధితురాలు మరణించిందని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. అత్యాచారం సమయంలో ఆమె మెడను పదే పదే నులిమివేయడంతో యువతి ఒంటిపై తీవ్రమైన గాయాలున్నట్లుగా వెల్లడించారు. అయితే ఇదే క్రమంలో నాలుక తెగి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు... ఇక బాధితురాలు రహస్య అవయవాల వద్ద గాయాలున్నట్టు తెలిపిన నివేదిక ఎలాంటి వీర్య కణాలు ఉన్నట్లు ఆధారాలు లభ్యంకాలేదని వెల్లడించింది.

అటు గొంతు నులిమడంతో వెన్నెముకకు బలంగా గాయం అయినట్లుగా వెల్లడించారు. పోస్టు మార్టం నివేదికలో యువతి ఒంటిపై తీవ్రమైన గాయాలున్నట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఈ ఘటన పైన యూపీ సీనియర్ పోలీస్ అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. నిందితులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇక ఈ గత నెల 14 న పశువుల మేత కోసం అడవికి వెళ్ళిన సదరు యువతిని నలుగురు యువకులు నిర్భందించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె నాలుక కోసి, వెన్నెముక, మెడపై తీవ్ర గాయాలు చేశారు. యువతి కోసం కుటుంబ సభ్యులు వెతకగా అపస్మారక స్థితిలో ఉండి కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భాదితురాలు మంగళవారం ప్రాణాలను విడిచింది. ఈ కేసులో నలుగురి పైన 302 కింద కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories