విమాన ప్రయాణాల కోసం 'ఫ్లైజీ' యాప్

విమాన ప్రయాణాల కోసం ఫ్లైజీ యాప్
x
Highlights

రోజురోజుకూ పెరుగుతున్న యాప్ ల వినియోగాన్ని వీలైనంత మేర వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న యాప్ ల వినియోగాన్ని వీలైనంత మేర వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రత్యేక యాప్ లను తయారు చేస్తూ వినియోగంలోకి తెస్తున్నారు. దీనిలో భాగంగానే విమాన ప్రయాణానికి పూర్తిస్థాయి సమాచారం కోసం ఐఐటీ గౌహతి విద్యార్థులు మరో యాప్ ను తీసుకొచ్చారు.

విమానాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, ఒత్తిడి లేని సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి అందుబాటులో ఉండేలా ఓ మొబైల్‌ యాప్‌ను తయారుచేశారు ఐఐటీ గౌహతి విద్యార్థులు. విమానాల వేళల నుంచి విమానాశ్రయంలో లభించే ఆహారం వరకు సకల సమాచారం ఈ యాప్‌లో లభిస్తుంది. అంతేకాదు 'ఫ్లైజీ' అని పేరుపెట్టిన ఈ యాప్‌ ద్వారా అనేక దేశాల కరెన్సీల్లో పేమెంట్లు కూడా చేసే వీలున్నది.

విమానం గంట లేటుగా బయల్దేరే పరిస్థితి ఉంటే ఆ గంటలో మీరు అక్కడ ఆర్డర్‌ ఇచ్చి తినగలిగే ఆహారం ఏమిటి? అనేది కూడా ఈ యాప్‌ తెలుపుతుంది. దీంతో షాపింగ్‌ కూడా ఎంచక్కా చేసేయొచ్చు. డీజీసీఏ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ యాప్‌ కరోనా సంక్షోభం తర్వాత కూడా విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని రూపొదించిన బీటెక్‌ విద్యార్థులు దీపక్‌మీనా, హంన్స్‌రాజ్‌ పటేల్‌, అర్జిత్‌సింగ్‌ తెలిపారు. ముఖ్యంగా కొత్తగా విమాన ప్రయాణం చేసేవారికి ఈ యాప్‌ మార్గదర్శిగా ఉంటుందని చెప్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories