దక్షిణ కాశ్మీర్‌లో మరో ఐదుగురు ఉగ్రవాదుల ఎన్ కౌంటర్

జమ్మూ కాశ్మీర్ లో బుధవారం భారిగా తుపాకుల మోత మోగింది. షో

Raj
By Raj
Updated on: 10 Jun 2020 10:43 PM IST
దక్షిణ కాశ్మీర్‌లో మరో ఐదుగురు ఉగ్రవాదుల ఎన్ కౌంటర్
X

జమ్మూ కాశ్మీర్ లో బుధవారం భారిగా తుపాకుల మోత మోగింది. షోపియన్ జిల్లాలో బుధవారం జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. దీంతో ఆదివారం నుండి షోపియన్‌లో ఇది మూడవ ఆపరేషన్ కాగా, ఇందులో ఇప్పటివరకు 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

బుధవారం జరిగిన ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు జమ్మూ కాశ్మీర్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. ఉదయం షోపియన్‌లోని సుగూ ప్రాంతంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాగా దక్షిణ కాశ్మీర్‌లో 24 గంటల్లోపు ఇద్దరు కమాండర్లతో సహా మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించవచ్చు.


Raj

Raj

Next Story