Odisha: ఫ్లై ఓవర్ నుంచి అదుపుతప్పి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతి

Odisha: 38 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు

Jyothi
Published on: 16 April 2024 9:01 AM IST
Five dead, 35 injured after Puri-Bengal bus falls from bridge in Odisha
X

Odisha: ఫ్లై ఓవర్ నుంచి అదుపుతప్పి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతి

Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ఫ్లై ఓవర్ నుంచి అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 38 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వెస్ట్ బెంగాల్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story