Rajasthan: భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోడౌన్‌లో ఎగిసిపడుతున్న మంటలు

Rajasthan: 12 ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్న సిబ్బంది

Jyothi
Published on: 30 March 2024 10:48 AM IST
Fire breaks out at Scrap Godown in Kota
X

Rajasthan: భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోడౌన్‌లో ఎగిసిపడుతున్న మంటలు 

Rajasthan: రాజస్థాన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోటా నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న రోడ్ నంబర్ 6లోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గోదాములో ప్లాస్టిక్, సీసాలలతో పాటు ఇతర వ్యర్థాలు పడి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

అగ్నిమాపక శాఖ 12 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మంటలు చెలరేగడంతో గోదాములోని టిన్ షెడ్డు కూలిపోయింది. ఘటనా స్థలంలో మంటలను ఆర్పుతున్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. మూడేళ్ల క్రితం కూడా ఇదే ప్రాంతంలోని ఓ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది.

Jyothi

Jyothi

Next Story