Tamil Nadu: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం.. క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు

Tamil Nadu: 8 మంది మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం

Dhatripriya
Updated on: 22 March 2023 5:00 PM IST
Fire Accident In Tamil Nadu At Crackers Factory
X

Tamil Nadu: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం.. క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు 

Tamil Nadu: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కాంచీపురంలోని ఓ బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మరణించారు. భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో క్రాకర్స్ ఫ్యాక్టరీలో దాదాపు 30 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది..సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. స్పాట్‌లోనే నలుగుగురు కార్మికులు చనిపోగా...మరో నలుగురు కాంచీపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన పరిశ్రమ 20 ఏళ్లకుపైగా క్రాకర్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసింది.

Dhatripriya

Dhatripriya

Next Story