Fire Accident in Covid Care Center : కేంద్రం నుండి ఏపీకి పూర్తి సహాకరం : అమిత్ షా

Fire Accident in Covid Care Center : కేంద్రం నుండి ఏపీకి పూర్తి సహాకరం : అమిత్ షా
x
Amit Shah (File Photo)
Highlights

Fire Accident in Covid Care Center : విజయవాడలో కోవిడ్ సెంటర్ గా ఉన్న స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్నిప్రమాదం పైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

Fire Accident in Covid Care Center : విజయవాడలో కోవిడ్ సెంటర్ గా ఉన్న స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్నిప్రమాదం పైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు అమిత్ షా.. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్దిస్తున్నట్లుగా అయన ట్వీట్ చేశారు. అటు ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు.


ఇక అంతకుముందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటన పైన స్పందించారు. ఈ ఘటన పైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఫోన్ చేసిన మోడీ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకి మెరుగైన చికిత్స అందించాలని మోడీ జగన్ కి సూచించారు. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని అయన వెల్లడించారు.

ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి కోవిడ్‌కేర్‌ సెంటర్‌గా ఉపయోగిస్తున్న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది కరోనా పేషెంట్లు చనిపోయినట్టు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. క్రింది అంతస్తుకు వ్యాపించాయి. దీంతో సెంటర్ లో ఉన్న పేషెంట్లు ఆందోళనతో పరుగులు తీశారు.

కొందరు భయంతో మొదటి అంతస్తు నుంచి దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయతే, బాధితులను తరలించడానికి అక్కడి మెట్ల మార్గం సరిపోలేదు. దీంతో వారిని నిచ్చెనల సహాయంతో మొదటి అంతస్తు నుంచి కిందకి చేర్చారు

Show Full Article
Print Article
Next Story
More Stories