Fire Accident in Vijayawada: విజయవాడ హోటల్ లో అగ్ని ప్రమాదం..

X
Highlights
Fire Accident in Vijayawada: విజయవాడ కోవిద్ ఆస్పత్రి నిర్వహించే ఒక ప్రైవేటు హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.
Bathula Yesu Babu9 Aug 2020 2:55 AM GMT
Fire Accident in Vijayawada: విజయవాడ కవిడ్ ఆస్పత్రి నిర్వహించే ఒక ప్రైవేటు హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోవిడ్‌కేర్ సెంటర్‌గా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో 50 మంది కరోనా పేషెంట్లకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే హోటల్ సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు విస్తృతంగా వ్యాపించాయి. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Web TitleFire Accident in Vijayawada hotel and Covid Patients who came out safely
Next Story