Omicron: ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసు

Omicron: తాజాగా ఢిల్లీలో మరో కేసు నిర్ధారణ అయ్యింది.

Sandeep Eggoju
Published on: 5 Dec 2021 12:48 PM IST
Fifth Omicron Variant Case Registered in Delhi
X
Representational Image

Omicron: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు వెలుగులోకి రాగా తాజాగా ఢిల్లీలో మరో కేసు నిర్ధారణ అయ్యింది. టాంజానియా నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం బాధితుడు నగరంలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇంతకుముందు కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు క్తొత వేరియంట్‌ సోకింది. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా దేశస్థుడు కాగా, మరొకరు స్థానిక ప్రభుత్వ వైద్యుడు. కాగా శనివారం మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు గుజరాత్‌కు, మరొకరు మహారాష్ట్రకు చెందినవారు. దీంతో కరోనా కొత్త వేరియంట్‌ మొత్తం కేసులు ఐదుకు చేరాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story