Bharat Bandh: ఇవాళ భారత్ బంద్

Bharat Bandh: భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

Sandeep Eggoju
Published on: 27 Sept 2021 8:11 AM IST
https://www.hmtvlive.com/tags/protest
X

భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు (ఫైల్ ఇమేజ్)

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ భారత్ బంద్‌కు జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటించాయి. ఏడాది క్రితం దేశ రాజధానికి మార్చ్ ప్రకటించిన రైతులు..ఇప్పుడు ఉద్యమం ఇంత పెద్దగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కేంద్ర ప్రభుత్వ వైఖిరికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వం తో పాటు రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సాయంత్రం వరకు ర్యాలీలు, నిరసనలు కొనసాగనున్నాయి. జాతీయ రహదారులపై ఆందోళనకు విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఇండియా గేట్ సహా ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story