బడ్జెట్ అంకెల గారడీగా ఉంది :చిదంబరం

admin1
Published on: 1 Feb 2020 9:17 PM IST
బడ్జెట్ అంకెల గారడీగా ఉంది :చిదంబరం
X

బడ్జెట్ అంకెల గారడీగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. బడ్జెట్‌లో పేర్కొన్న లెక్కలకు, ఖర్చులకు పోలిక లేదని… 2020-21 బడ్జెట్ లక్ష్యమేమిటో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనలేదని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొంటుందన్న ఆయన, పేద, మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ వల్ల ఒరిగిదేమి లేదన్నారు. దేశంలో అనేక సమస్యలకు పరిష్కారాలను బడ్జెట్ పరిష్కారం చూపలేదన్నారు. ఎల్ఐసీ వాటాల విక్రయం నిర్ణయాన్ని చిదంబరం తప్పుబట్టారు. స్టాక్ మార్కట్లలో ఎల్ఐసీని లిస్టింగ్ తీసుకురావొద్దన్నారు. దీనిపై తమ పార్టీలో విస్తృత చర్చ జరుపనున్నట్లు తెలిపారు.

admin1

admin1

Next Story