Corona Vaccine in India: 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్

Vaccine For All Above 18 Starting:(File Image)
Corona Vaccine in India: మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Corona Vaccine in India: తొలిసారి కన్నా రెండోసారి కొవిడ్-19 చాలా వేగంగా వ్యాపించటానికి కొత్తరకం కరోనా వైరస్ కారణం అంటున్నారు మన వైద్యలు. అతి త్వరగా వ్యాపించటం దీని ప్రత్యేకత. చాలామందిలో లక్షణాలు పెద్దగా కనిపించటం లేదు కూడా. ఇంట్లో, ఆఫీసులో, కర్మాగారాల్లో ఒకరికి వస్తే అందరికీ అంటుకుంటోంది. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. సెకండ్ వేవ్ లో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడో విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఏడాది కాలంగా అత్యధిక మంది భారతీయులకు వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఈ సందర్భంగా అన్నారు. వీలైనంత తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తామన్నారు. ఇందులో భాగంగా 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఔషధ సంస్థలు వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేసేందుకు ప్రోత్సహించడంతో పాటు, అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఇతర కంపెనీలకు దేశీయంగా అనుమతులు ఇవ్వనున్నారు.
సెకండ్ వేవ్ లో యువత, చిన్న వయసుల వారే ఎక్కువగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. అన్‌లాక్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తమకేమీ కాదనే నిర్లక్ష్యంతో గైడ్‌లైన్స్‌ను పాటించకపోవడంతో వారిపై వైరస్ ఎటాక్ చేస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగడం, గంటల కొద్దీ గుమిగూడి ముచ్చట్లు పెట్టడం, మాస్కులు పెట్టుకోకపోవడం, శానిటైజర్లు వాడకపోవడం వంటి కారణాలతో కరోనా కోరలకు యూత్ చిక్కుకుంటున్నారు. వారి వల్ల ఇంట్లో వాళ్లకు కూడా వైరస్ సోకుతోంది. సర్కారు లెక్కల ప్రకారం మొత్తం కరోనా కేసుల్లో 21-–30 ఏండ్ల ఏజ్ గ్రూప్ వాళ్లే 23.66 శాతం మంది ఉంటున్నారు. 31–-40 ఏండ్ల ఏజ్ గ్రూప్ వాళ్లు 23.04 శాతం మంది ఉన్నారు. గతంలో 60 ఏండ్లు పైబడిన వాళ్లకే కరోనా ప్రమాదకరంగా మారుతుందని, వాళ్లకే తొందరగా వైరస్ సోకుతుందని భావించే వాళ్లు. కానీ ఇప్పుడు యూత్‌పై కూడా అది తీవ్ర ప్రభావం చూపుతోంది.రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
గతంలో ప్రకటించిన విధంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు 45ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ యథావిధిగా కొనసాగుతుంది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT