చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసులు-మావోయిస్టుల మధ్య కాల్పులు

Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసులు-మావోయిస్టుల మధ్య కాల్పులు

Jyothi
Published on: 14 April 2024 2:32 PM IST
Encounter In Chhattisgarh
X

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసులు-మావోయిస్టుల మధ్య కాల్పులు

Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ధామతరి జిల్లా బొరాయి పీఎస్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఏకవారి అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. మెయిన్పూర్ నువాపాడ జాయింట్ డివిజన్ కు చెందిన మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు. పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. సుమారు అర్ధగంటపాటు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. పోలీసుల దాడి నుంచి మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారు. ఘటనా స్థలం నుంచి బీజీఎల్ లైవ్ గ్రెనేడ్, నిషేధిత మావోయిస్టు సంస్థ ప్రచార సామాగ్రి, బ్యానర్లు, సాహిత్యం, మావోయిస్టుల యూనిఫాం, సోలార్ ప్లేట్, వైర్ బండిల్, రోజువారి వినియోగ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story