మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి హవా! హరియాణాలో నువ్వా..నేనా!!

మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి హవా! హరియాణాలో నువ్వా..నేనా!!
x
Highlights

సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చిన ముఖ్యమైన ఎన్నికలు. మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఎన్నికలు. ఈ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా...

సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చిన ముఖ్యమైన ఎన్నికలు. మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఎన్నికలు. ఈ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ ఆర్టికల్ 370 రద్దు తరువాత వచ్చిన ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమకు ప్రజా మద్దతు ఉందని నిరూపించాలని భావించింది. అదేవిధంగా కాంగ్రెస్ తన సర్వా శక్తులూ ఒడ్డి పోటీలో నిలిచింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు (అక్టోబర్ 24) ఉదయం ప్రారంభమైంది.

ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతోంది. కాగా, హరియాణలో మాత్రం రెండు పార్టీల మధ్య నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ నడుస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గానూ బీజేపీ-శివసేన కూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 175 స్థానాల్లో గెలుపు దిశలో దూసుకుపోతోంది ఈ కూటమి. ఇక కాంగ్రెస్ పార్టీ 91 కేంద్రాలలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక ఇతరులు 22 చోట్ల తమ ప్రభావాన్ని చూపుతున్నారు.

ఇక హరియాణా లో మొత్తం 190 స్థానాలకు గానూ బీజేపీ 41 చోట్ల ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ఇతరులు 19 స్థానాల్లో ముందంజలో ఉండడం విశేషం.

కాగా, ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దాదావుగా అన్ని ఫలితాలు బీజేపీ అన్ని చోట్లా విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కానీ, అందుకు విరుద్ధంగా హరియాణా లో హంగ్ దిశలో ఫలితాలు వెలువడుతుండడం గమనార్హం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories