ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనున్న ఈడీ...?

Arvind Kejriwal: ఈరోజు అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు

Jyothi
Published on: 4 Jan 2024 10:18 AM IST
ED to Arrest Delhi CM Arvind Kejriwal?
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనున్న ఈడీ...? 

Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయబోతుందంటూ.. ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ లిక్కర్, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ ఇప్పటికీ ఒక్కసారిగా కూడా ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఇప్పటికే మద్యం కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను లెక్క చేయని ఆయన.. మూడోసారి జారీ చేసిన సమన్లపై స్పందిస్తూ ఈడీకి లేఖ రాశారు.

రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story