E-Mail Threat: అమిత్ షా, యూపీ సీఎం యోగిలకు బెదిరింపులు

E-Mail Threat: హతమారుస్తామంటూ ఈ- మెయిల్ కలకలం * ముంబైలోని సీఆర్పీఎఫ్ కు ఈ- మెయిల్

Sandeep Eggoju
Updated on: 6 April 2021 1:39 PM IST
E-Mail Threat to Amit Shah and UP Cheif Minister Yogi Adityanath
X

యూపీ సీఎం యోగి ఆదిత్య & హోంమినిస్టర్ అమిత్ షా 

E-Mail Threat: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లను హతమారుస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్‌ కలకలం సృష్టించింది. ఉదయం ముంబైలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు ఈ మెయిల్ రావడంతో కేంద్రం అలెర్ట్ అయింది. ప్రార్థనా స్థలాలు, ముఖ్యమైన ప్రదేశాలపై దాడులు చేస్తామని మెయిల్‌లో పేర్కొన్నారు.

ఆత్మాహుతి దాడుల ద్వారా యోగి ఆదిత్యానాథ్, అమిత్‌షాలపై దాడి చేస్తామని ఈమెయిల్ చేశారు. 11 ఆత్మహుతి దళాలు యోగి ఆదిత్యనాథ్, అమిత్‌షాలపై దాడికి నియమించబడ్డాయని ఈ మెయిల్ లో పేర్కొన్నారు. దీంతో కేంద్రం అప్రమత్తమయింది. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story