Dubshoot Tiktok Alternative app : టిక్‌టాక్‌ ప్రత్యామ్నాయంగా డబ్‌షూట్‌!

Dubshoot Tiktok Alternative app : తాజాగా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ తో పాటుగా 59 చైనా యాప్ లపైన నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Krishna
Published on: 5 July 2020 7:08 AM IST
Dubshoot  Tiktok Alternative app : టిక్‌టాక్‌ ప్రత్యామ్నాయంగా డబ్‌షూట్‌!
X

Tiktok Alternative app is Dubshoot : తాజాగా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ తో పాటుగా 59 చైనా యాప్ లపైన నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. దీనితో చైనాకి పెద్ద షాకే తగిలింది. ఇక భారత్ లో టిక్ టాక్ కి అత్యధిక డౌన్ లోడ్లు ఉన్న సంగతి తెలిసిందే... భారత్ గత కొద్ది రోజుల నుంచి టిక్ టాక్ డౌన్ లోడ్లు విషయంలో మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. మొత్తం భారత్ లో 120 మిలియన్ల టిక్ టాక్ డౌన్ లోడ్లు ఉండగా, ఇప్పుడు అన్ని అన్ ఇన్స్టాల్ అయిపోయాయి. టిక్ టాక్ బ్యాన్ వలన దాని మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌ ఏకంగా రూ.45వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) నష్టపోనుందని ఇప్పటికే చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

ఈ నేపథ్యంలో దేశీయ యాప్స్‌పైన వినియోగదారులు దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే భారతీయ యాప్స్‌ కి మంచి స్పందన వస్తోంది. వీటి డౌన్లోడ్ ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. అందులో డబ్‌షూట్‌ ఒకటి... ఇప్పటికే ఈ యాప్‌ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్‌లు విపరీతంగా పెరిగాయని, హాఫ్‌ మిలియన్‌ యూజర్లను దాటేసిందని, డబ్‌ షూట్‌ సీఈవో పి.వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిని హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌టచ్ ల్యాబ్స్ అభివృద్ధి చేసింది. ఈ యాప్ అచ్చం టిక్‌టాక్‌ లాగే పనిచేస్తోంది. ప్రతి రోజు, ఈ ప్లాట్‌ఫాం ద్వారా 15,000 మంది కొత్త వినియోగదారులు తమ అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story