మైనర్ల డ్రైవింగ్: ఐదు నెలల్లో 573 శాతం పెరిగిన చలాన్లు

గత ఏడాది జనవరి నుండి మే 15 వరకు మైనర్లు డ్రైవింగ్ చేసినందుకు దిల్లీలో 15 చలాన్లు మాత్రమే జారీ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 101 చలాన్లు జారీ అయినట్టుగా ట్రాఫిక్ పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Jun 2024 5:10 PM IST
Driving by minors 573 percent increase in traffic in five months
X

మైనర్ల డ్రైవింగ్: ఐదు నెలల్లో 573 శాతం పెరిగిన చలాన్లు

దిల్లీలో మైనర్లు డ్రైవింగ్ చేసినందుకు ఐదు నెలల్లో 101 చలాన్లను ట్రాఫిక్ పోలీసులు జారీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే చలాన్ల జారీ 573 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమౌతున్నారు. మహారాష్ట్రలోని పుణె పోర్షె కారు ఘటన ఇందుకు ఉదహరణగా ట్రాఫిక్ పోలీసులు గుర్తు చేస్తున్నారు.

గత ఏడాది జనవరి నుండి మే 15 వరకు మైనర్లు డ్రైవింగ్ చేసినందుకు దిల్లీలో 15 చలాన్లు మాత్రమే జారీ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 101 చలాన్లు జారీ అయినట్టుగా ట్రాఫిక్ పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల పెరుగుదలను సూచిస్తుంది. సీసీటీవీల ద్వారా మైనర్లు డ్రైవింగ్ చేసే వాహనాలను గుర్తిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘాను పెంచారు. విద్యా సంస్తల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కేసులు, దాని తర్వాత చోటు చేసుకొనే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా దిల్లీ పోలీసులు తెలిపారు.

దిల్లీలో గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో 1239 మంది మరణించారు. అయితే 2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 3.3 శాతం తగ్గినట్టుగా ట్రాఫిక్ పోలీసులు రికార్డులు చెబుతున్నాయి.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానా

సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్: రూ. 1000 జరిమానా లేదా కమ్యూనిటీ సర్వీస్

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్: రూ. 5 వేల జరిమానా

ఓవర్ స్పీడ్: లైట్ మోటార్ వాహనమైతే రూ. 1000 -2000 వరకు ఫైన్, హెవీ వెహికల్స్ అయితే రూ. 2000-4000

మద్యం తాగి డ్రైవింగ్: రూ. 10,000- రూ. 15,000 ఫైన్

ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్: రూ. 2 వేల ఫైన్ తో పాటు మడు నెలల జైలు, కమ్యూనిటీ సర్వీస్

స్పీడ్ రేస్: రూ.5 వేల ఫైన్ తో పాటు మూడు నెలల జైలు శిక్ష

మైనర్లు డ్రైవింగ్ చేస్తే: రూ. 25వేల ఫైన్, మూడేళ్ల జైలు శిక్ష, 25 ఏళ్ల వరకు లైసెన్స్ కు అనర్హుడు.

మైనర్లకు వాహనాలు ఇస్తే మైనర్ల పేరేంట్స్ తో పాటు వాహన యజమానిని బాధ్యుడిగా చేస్తారు.ఈ మేరకు చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ, మైనర్లు వాహనాలు నడుపుతున్న ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story