Mainpuri Bypoll Result: డింపుల్‌ యాదవ్‌ భారీ విజయం.. 2,88,461 ఓట్ల మెజార్టీతో..

Dimple Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు.

Arun Chilukuri
Updated on: 8 Dec 2022 8:00 PM IST
Dimple Yadav Wins Mainpuri LS Seat
X

Mainpuri Bypoll Result: డింపుల్‌ యాదవ్‌ భారీ విజయం.. 2,88,461 ఓట్ల మెజార్టీతో..

Dimple Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్‌లో మృతి చెందడంతో మెయిన్ పూరి లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి ఎస్పీ తరపున ములాయం కోడలు, అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2,88,461 ఓట్ల భారీ తేడాతో విజయ కేతనం ఎగరవేశారు.

కాగా మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ములాయం ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై విజయం సాధించారు. ఇప్పుడు డింపుల్ యాదవ్ రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందడం గమనార్హం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story