ధోనీ ది రియల్ హీరో!

ధోనీ ది రియల్ హీరో!
x
Highlights

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన ఆటతీరుతో అందరినీ మెప్పించి మెరుపులా భారత జట్టుకు నాయకుడిగా...

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన ఆటతీరుతో అందరినీ మెప్పించి మెరుపులా భారత జట్టుకు నాయకుడిగా ఎదిగాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నట్టు.. జట్టు ప్రయోజనాల కోసం అన్ని స్థాయిల్లోనూ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. ప్రపంచ కప్ కళను సాకారం చేశాడు అయినా ఎప్పుడూ ధోనీ కూల్ గానే ఉన్నాడు. మిస్టర్ కూల్ గా ప్రశంసలు అందుకున్నాడు. ఇలా ఎన్ని చెప్పినా ఎదో ఒకటి మిగిలిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల ధోనీ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం అందరికీ తెల్సిందే. తనకు రెండు నెలల పాటు సైన్యంలో అదీ.. కాశ్మీర్ లో పని చేయాలనుందని ఆర్మీ అధికారులను అభ్యర్థించాడు. అతని అభ్యర్థనను మన్నించిన ఆర్మీ అధికారులు అవసరమైన శిక్షణ ఇచ్చి కశ్మీర్ సరిహద్దుల్లో గార్డ్ పోస్టింగ్ ఇచ్చారు. ఇదంతా తెలిసిందే.

ప్రస్తుతం కాశ్మీర్ లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సైన్యంలో తనకున్న అధికారిక గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా వదులుకుని సాధారణ సైనికునిలా పహారా విధులు నిర్వర్తిస్తున్నాడు ధోనీ. విపత్కర పరిస్థితిలోనూ తన విధులను నిర్వర్తిస్తూ అధికారులతోనే కాకుండా తోటి సైనికులతోనూ ఔరా అనిపించుకుంటున్నాడు. ఇటీవలే విరామ సమయంలో సహచరులతో వాలీబాల్ ఆడుతూ కనిపించిన ధోనీ తాజాగా గాయకుడి అవతారమెత్తాడు. అత్యంత ఒత్తిడితో కూడిన విధులతో అలసిన ఇతర జవాన్లకు ఉల్లాసం కలిగిస్తూ బాలీవుడ్ గీతాలు ఆలపించాడు.

'కభీ కభీ' చిత్రంలోని 'మై పల్ దో పల్ కా షాయర్ హూ' పాట పాడి అలరించాడు. ప్రస్తుతం 106 టీఏ బెటాలియన్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఆగస్టు 15 వరకు విధుల్లో కొనసాగనున్నాడు. ఇదేకాకుండా తాజాగా ధోనీకి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. సాధారణంగా ఉన్న ఓ గదిలో సైనిక దుస్తుల్లో ఉన్న ధోనీ తన బూట్లను పాలిష్ చేసుకుంటున్న ఆ ఫోటో ఇపుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ధోనీని రియల్ హీరో అంటూ అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏదిఏమైనా కల్లోల కాశ్మీరంలో ధోనీ లాంటి వ్యక్తి తనకు తోచిన విధంగా చేస్తున్న దేశసేవ మన దేశ యువతలో కచ్చితంగా దేశం పట్ల బాధ్యతను మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories