Asaduddin Owaisi: ఒవైసీకి ఊహించని షాక్..

FIR Against Asaduddin Owaisi: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఊహించని షాక్ తగిలింది.

Arun Chilukuri
Updated on: 9 Jun 2022 9:30 PM IST
Delhi Police File FIR Against AIMIM Chief Asaduddin Owaisi
X

Asaduddin Owaisi: ఒవైసీకి ఊహించని షాక్..

FIR Against Asaduddin Owaisi: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఊహించని షాక్ తగిలింది. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేయ‌డం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు హాని క‌లిగించ‌డం, సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వంటి ఆరోపణలపై ఒవైసీపై FIR నమోదైంది.

అలాగే దాస్నా దేవి ఆలయ పూజారి యతి నర్సింహానంద్‌పై కూడా కేస్ బుక్ చేశారు పోలీసులు. బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు MIM మధ్యప్రదేశ్ నాయకులు ఇవాళ తమ అధినేత ఒవైసీతో భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నకల్లో మధ్యప్రదేశ్ లోనూ మజ్లిస్ నేతలను బరిలో దించాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story