Kejriwal: ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

Kejriwal: ఇంటింటికీ రేషన్‌ స్కీమ్‌ను అడ్డుకోవద్దని విజ్ఞప్తి

Sandeep Eggoju
Published on: 8 Jun 2021 4:41 PM IST
Delhi CM Kejriwal Letter to PM Modi
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (ఫైల్ ఇమేజ్)

Kejriwal: ఢిల్లీలో ఇంటింటికీ రేషన్‌ సరుకులు అందించే పథకాన్ని అడ్డుకోవద్దంటూ ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి తాను బాసటగా నిలిచానని, అదే స్ఫూర్తితో మీరూ తమకు అండగా నిలవాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలో చేపట్టబోయే ఇంటింటికీ రేషన్‌ పథకానికి అనుమతి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నివసిస్తోన్న 70లక్షల మంది పేదల తరపున చేతులు జోడించి అభ్యర్ధిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఒకవేళ కేంద్రం ఏమైనా మార్పులు సూచిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతేకాదు, కరోనాతో ఇబ్బందులు పడుతోన్న ప్రజల కోసం దేశవ్యాప్తంగా ఇంటింటికీ రేషన్ పథకాన్ని అమలు చేయాలని ప్రధానిని కోరారు కేజ్రీవాల్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story