డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ మూసివేస్తున్నారట!

డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ మూసివేస్తున్నారట!
x
Highlights

పర్యాటకానికి ఎంతో ప్రతిష్ట ఉన్న డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ ను మూడు నెలల పాటు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

పర్యాటకానికి ఎంతో ప్రతిష్ట ఉన్న డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ ను మూడు నెలల పాటు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ రైల్వే స్టేషన్ లో పనులు నిర్వహించనున్నారు.ఈ కారణంగా నవంబర్ పదో తేదీ నుంచి ఈ స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు డెహ్రాడూన్ స్టేషన్ ప్రయాణీకులకు అందుబాటులో ఉండదు.

డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ కు పర్యాటక కేంద్ర స్టేషన్ గా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడకు పర్యాటకులు నిత్యం వేలాదిగా వస్తుంటారు. అయితే, శీతాకాలంలో కొంచెం పర్యాటకుల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అందుకోసం ఈ సమయంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక ఈ మూడునెలల పాటు దగ్గరలోని హరిద్వార్ స్టేషన్ ను ఉపయోగించుకొనున్నట్టు ఇజ్జత్ నగర్ రైల్వే డివిజన్ పీఆర్వో రాజేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి నిత్యం 15 రైళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అమృత్ సర్, సహరాంపూర్, హౌరా, ప్రయాగారాజ్, లక్నో, డిల్లీ, చండీగడ్, కోటా, ముజఫర్ బాద్ తొ పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుంచి రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ అభివృద్ధి పనుల అనంతరం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీ తరువాత నుంచి అందుబాటులోకి వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories