భారత్‌లో తగ్గుతున్న కరోనా

Corona Cases: ఇవాళ 50,407 కరోనా కేసులు నమోదు, నిన్నటితో పోలిస్తే 13 శాతం తగ్గిన కేసులు.

Sriveni Erugu
Published on: 12 Feb 2022 11:31 AM IST
Decreasing Corona in India
X

భారత్‌లో తగ్గుతున్న కరోనా

Corona Cases: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ 50 వేల 407 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 13 శాతం తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా రికవరీ కేసుల సంఖ్య లక్షా 36వేల 962గా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 804 మంది మృతి చెందారు. 6 లక్షల, 10వేల 443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5 లక్షల 7వేల 981గా ఉందని వైద్యరోగ్యశాఖ చెప్పింది. డెయిలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story