Kerala: కేరళా బోటు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 23కు చేరిన మృతుల సంఖ్య

Kerala: ప్రమాద సమయంలో బోటులో 40 మంది ప్రయాణికులు

Dhatripriya
Updated on: 8 May 2023 8:29 AM IST
Death Rate Is Increasing In Kerala Boat Accident
X

Kerala: కేరళా బోటు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 23కు చేరిన మృతుల సంఖ్య 

Kerala: కేరళలో రాత్రి జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 23 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్‌లో టూరిస్టు బోటు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతయిన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.

ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరిందని కేరళ మంత్రి వీ.అబ్ధుర్ రెహ్మాన్ తెలిపారు. ప్రధాని న‌రేంద్ర మోదీ సహా ప‌లువురు ఈ ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story