ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

admin1
Updated on: 11 Jan 2020 10:40 AM IST
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
X

ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వేగంగా వస్తున్న ఓ బస్సు భారీ లోడ్ తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్దమైంది. బస్సులో ఉన్న 20 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో 21 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల, దర్యాప్తు చేస్తున్నారు.

admin1

admin1

Next Story