Cyclone Tauktae 2021: అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం

Cyclone Tauktae 2021: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.

Arun Chilukuri
Published on: 14 May 2021 5:00 PM IST
Cyclone Tauktae 2021
X

అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం

Cyclone Tauktae 2021: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుగా మారితే దీన్ని 'తౌక్టే' అని పిలుస్తారు. 'తౌక్టే' తీవ్ర తుపానుగా, అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది, గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. దీని ప్రభావంతో లక్ష్యద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కొంకణ్-గోవా, గుజరాత్, నైరుతి రాజస్థాన్ లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ నివేదికలో పేర్కొన్నారు. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ బలమైన గాలులు, కుంభవృష్టి తప్పదని హెచ్చరించారు. తౌక్టే ప్రభావం ఏపీపై పాక్షికంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి ఈ తుపాను మార్గం సుగమం చేస్తుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story