Petrol, Diesel price Today: యధావిధిగా కొనసాగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, Diesel price Today: తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో అన్ని నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా వున్నాయి.

Kranthi
Published on: 28 April 2021 6:55 AM IST
Current Petrol and Diesel Prices 28.04.2021
X

Petrol, Diesel price Today:(File Image)

Petrol, Diesel price Today: తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో అన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.54 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.04 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 96.01ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.89 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.69 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.22గా ఉంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్‌ ధర రూ.93.99 కి ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.05 కి చేరింది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.12 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.15గా ఉంది.

Kranthi

Kranthi

Next Story