Cryptocurrency: క్రిప్టో మార్కెట్‌పై ఒమిక్రాన్ నీలి నీడలు

Cryptocurrency: 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయిన క్రిప్టో మదుపరులు

Sandeep Eggoju
Published on: 4 Dec 2021 6:57 PM IST
Cryptocurrency Customers Lost  2.4 Billion Dollars Due to Omicron
X

2.4 బిలియన్ డాలర్లు నష్టపోయిన క్రిప్టో మదుపరులు (ఫైల్ ఇమేజ్)

Cryptocurrency: కోవిడ్ నయా వేరియంట్‌ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బెంబేలెత్తిపోతున్నాయి. తాజాగా ఈ ఎఫెక్ట్ క్రిప్టో కరెన్సీ విపణిపైనా పడింది. ఒమిక్రాన్ భయాందోళనలతో ఈ ఒక్కరోజే క్రిప్టో మదుపరులు 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ప్రధానంగా బిట్ కాయిన్ విలువ దారుణంగా పడిపోయింది. బిట్ కాయిన్ విలువ ఒక్కరోజే 11 శాతం పతనమై, 42వేల 296 డాలర్లకు పడిపోయింది. మరో క్రిప్టోకరెన్సీ ఈథర్ పైనా ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ఈథర్ విలువ 17.4 శాతం పడిపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎలా ఉండబోతోందన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోవడంతో, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితి నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story