Criminal Tinku Kapala Killed in Encounter : యూపీలో మరో గ్యాంగ్‌స్టర్‌ టింకూ క‌పాలా ఎన్‌కౌంటర్‌

Arun Chilukuri
Published on: 25 July 2020 12:27 PM IST
Criminal Tinku Kapala Killed in Encounter : యూపీలో మరో గ్యాంగ్‌స్టర్‌ టింకూ క‌పాలా ఎన్‌కౌంటర్‌
X

criminal Tinku Kapala killed in encounter : యూపీలో క్రిమినల్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను మట్టుబెట్టారు. అదే క్రమంలో మరోమారు పోలీసులు తమ తూటాలకు పని చెప్పారు. శనివారం ఉదయం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టింకూ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో క్రిమినల్ టింకూ హతమయ్యాడు. బారా బంకీ ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

ఈ ఎన్‌కౌంటర్ లో కరడుకట్టిన నేరగాడు టింకూ కపాలా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన టింకూను ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మరణించాడని ఎస్పీ అర్వింద్ చతుర్వేది చెప్పారు. టింకూ తలమీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆయన వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, 20 ఏళ్లుగా నిషేదిత కార్యక్రమాలను పాల్పడున్నాడని పేర్కొన్నారు. టింకూ టీంలోని మరికొంత మంది క్రిమినల్స్‌ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఎన్‌కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మాఫియాను ప్రోత్సహిస్తున్న వారి జాబితాను తయారుచేసి వెంటాడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story